Dr. డా.ఎన్.ఈశ్వర రెడ్డి

Dr. డా.ఎన్.ఈశ్వర రెడ్డి

డా.ఎన్.ఈశ్వర రెడ్డి చిత్తూరు జిల్లా మొండివెంగన పల్లె గ్రామంలో 1971 లో జన్మించారు. ఎం.ఏ తెలుగు, ఎం.సి.జె. (జర్నలిజం), పిహెచ్. డి చేశారు.ఆధునిక తెలుగు కవిత్వంలో ఉద్యమాలు, వాదాలు ,ధోరణులు అనే అంశంపై భారత ప్రభుత్వ ప్రాజెక్టు చేశారు.కన్నీటి సీమ,నాకొక మనిషి కావాలి( కవితా సంపుటాలు), సోమసుందర్ సాహిత్య దృక్పథం, కవిత- మానవీయత, సాహిత్యం-సామాజిక దృక్పథం (విమర్శ), మనసు పాట,(గేయ కవిత్వం) రైతన్నా మేలుకో- ఆత్మహత్య మానుకో(ప్రబోధ రచన)వీరి రచనలు. 70 జాతీయ, అంతర్జాతీయ సదస్సుల్లో పత్ర సమర్పణలు,వివిధ పత్రికల్లో 75 కు పైగా వ్యాసాల ప్రచురణ,వివిధ సందర్భాల కోసం రాసిన ప్రత్యేక గేయాలు వీరికి గుర్తింపు తెచ్చాయి. ప్రస్తుతం యోగి వేమన విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖ అధిపతిగా, అభ్యుదయ రచయితల సంఘం కడపజిల్లాకు అధ్యక్షుడుగా, ‘వేమన వాణి’ పత్రికకు సంపాదకుడిగా, తెలుగు భాషాభివృద్ధి సమితికి ఉపాధ్యక్షుడుగా సేవలు అందిస్తున్నారు.