తేదీ: 21 సెప్టెంబర్ 2026, శనివారం
అంశం: “గురుజాడ సాహిత్యం: వస్తు వైవిధ్యం, సామాజిక చింతన”
వేదిక: కాకరపర్తి భావనారాయణ కళాశాల, విజయవాడ
మహాకవి గురజాడ అప్పారావు 111 వ వర్ధంతిని పురస్కరించుకుని గురజాడ ఫౌండేషన్ (అమెరికా), కాకరపర్తి భావనారాయణ కళాశాల (స్వయంప్రతిపత్తి), పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం సంయుక్తంగా నిర్వహిస్తున్న అంతర్జాతీయ సదస్సులో పాల్గొనడానికి ఆహ్వానం.
గురజాడ సాహిత్య వ్యక్తిత్వంలోని పలు అంశాలను సమీక్ష చేసుకుంటూ గురజాడ సాహితీ వారసత్వాన్ని భావితరాలకు పదిలపరచాలనే ఆకాంక్షతో నిర్వహిస్తున్న యువచైతన్య దినోత్సవం యువ సాహిత్య పరిశోధకులకు వేదిక కావాలన్నది ఈ సదస్సు ఆశయం.
పత్ర సమర్పణ ప్రక్రియ, మార్గదర్శక సూచనలు:
- పత్ర సమర్పణ చేయాలనుకునేవారు ముందుగా తాము రాయదలచుకున్న వ్యాస సారాంశాన్ని 150 పదాలకు మించకుండా రాసి సదస్సు నిర్వాహకులకు పంపాలి.
- వ్యాస సారాంశం ప్రాతిపదికన ఎంపిక చేసిన వ్యాసకర్తలు పూర్తిస్థాయి వ్యాసం పంపడానికి అర్హులు.
- పూర్తి స్థాయి వ్యాసం పంపేవారు INR 500 ప్రవేశ రుసుము చెల్లించవలసి ఉంటుంది. వివరాలు పూర్తి స్థాయి వ్యాసాలు రాసే వారికి తెలియపరుస్తాము.
- పూర్తిస్థాయి వ్యాసం పరిశీలన జరిగిన తరవాత సదస్సులో పత్ర సమర్పణ చేసే అవకాశం ఉన్నవారి ఎంపిక జరుగుతుంది.
- వ్యాస సారాంశం, పూర్తి స్థాయి వ్యాసాలు పంపవలసిన ఈమెయిల్: [email protected]
గుర్తుంచుకోవాలసిన ముఖ్య తేదీలు:
- వ్యాస సారాంశం సమర్పణకు తుది గడువు: 25 సెప్టెంబరు 2026
- పూర్తిస్థాయి వ్యాసం పంపడానికి అర్హత పొందిన వారికి తెలియపరచే తేదీ: 30 సెప్టెంబరు 2026
- అర్హత పొందినవారు పూర్తిస్థాయి వ్యాసాలు పంపవలసిన ఆఖరు రోజు: 25 అక్టోబర్ 2026
- సదస్సులో పత్ర సమర్పణ చేసే అవకాశం ఉన్నవారికి తెలియపరచే తేదీ: 04 నవంబరు 2026
వ్యాస సారాంశం, పూర్తిస్థాయి వ్యాసం మైక్రోసాఫ్ట్ వర్డ్ (.doc/.docx ఫార్మాట్‌లో యూనికోడ్ లో టైపు చేసి మాత్రమే పంపాలి.
గడువు తేదీ తర్వాత వచ్చిన వ్యాస సారాంశాలు, పూర్తిస్థాయి వ్యాసాలు ఎట్టి పరిస్థితుల్లోనూ స్వీకరించబడవు.
పరిశోధనా పత్ర రచయితలకు మార్గదర్శక సూచనలు:
- పరిశోధనా పత్రం సదస్సు ప్రధానాంశానికి ప్రత్యక్ష సంబంధం కలిగి, నిర్వాహకులు సూచించిన ఉప-అంశాలలో దేనికైనా చెందినదై ఉండాలి.
- పత్రం మౌలికమైనదిగా (originally authored), గతంలో ఏ జర్నల్‌లోనూ, సదస్సులోనూ ప్రచురితం కాకుండా, మరే ఇతర వేదికకూ సమర్పించకుండా ఉండాలి. తగిన హామీపత్రం కూడా పరిశోధన పత్రంతో పాటు జతపరచాలి.
- హామీపత్రం లేని పత్రాన్ని ఎట్టిపరిస్థితిలో స్వీకరించడం జరగదు.
- ఒక రచయితకు ఒక పత్రాన్ని సమర్పించడానికి మాత్రమే అనుమతి ఉంటుంది. పరిశోధనా పత్రాలు A4 సైజు పేపరు లో 4 పేజీలకు మించకూడదు. సింగల్ స్పేస్ లో టైపు చేసి పంపాలి. వ్యాసం చివర ఆధార గ్రంధాల జాబితా తప్పనిసరిగా పెట్టాలి.
- పత్రంలో మౌలికత (originality 85% కంటే తక్కువ కాకుండా ఉండాలి; సారూప్యతా పరీక్ష (plagiarism/ similarity check) నిర్వహించి ధృవీకరణ పత్రంతో సమర్పించవలసి ఉంటుంది.
పరిశోధనా పత్ర రచయితలకు మార్గదర్శక సూచనలు:
- పత్రంలో వ్యక్తీకరించిన అభిప్రాయాలకు సంబంధిత రచయితలే బాధ్యులు. నిర్వాహక సంస్థలు వాటికి బాధ్యత వహించవు. పత్రంలోని అంశాలపై వాదోపవాదాలకు తావులేదు.
- ప్రతి పరిశోధనాపత్రం డబుల్-బ్రైండ్ పీర్ రివ్యూ (double-blind peer review) ప్రక్రియ ద్వారా నిపుణుల సమితి పరిశీలనకు పంపబడుతుంది. నిపుణులు ఎంపిక విషయంలో వాదవివాదాలకు ఎటువంటి అవకాశం లేదు.
- ఎంపికైన పరిశోధనా పత్రాలు ISSN కలిగిన సంకలన గ్రంథం లేదా ప్రత్యేక సంచికగా ప్రచురించబడతాయి.
- ఆమోదం పొందిన పత్రాలు మాత్రమే సదస్సులో మౌఖిక పత్ర సమర్పణకి (presentation), సంకలన ప్రచురణకి (proceedings/edited volume) పరిగణించబడతాయి.
- ప్రచురణకు ఎంపికైన పత్రాలు సంపాదక మండలి నిర్దేశించిన తుది ఫార్మాటింగ్ మార్గదర్శకాలను తప్పనిసరిగా అనుసరించాలి.
- సదస్సుకు ప్రత్యక్షంగా వ్యక్తిగతంగా హాజరైనవారికి మాత్రమే సర్టిఫికెట్ ఇవ్వటం జరుగుతుంది.
- ఈ విషయంలో ఎటువంటి చర్చలకు అవకాశం ఉండదు.
సదస్సుకు సంబంధించిన వివరాలకు సంప్రదించవలసిన నెంబర్: 90320 44115; ఈమెయిల్: [email protected]
ఈ క్రింద సూచించిన అంశాలలో ఒక అంశం తీసుకుని వ్యాస సారాంశం, పూర్తి వ్యాసం రాయవచ్చును.
- గురజాడ సాహిత్యం – ఆధునికత, స్వదేశీ ఆధునికత మరియు సమకాలీనత
- గురజాడ సాహిత్యం – నాటకశిల్ప అధ్యయనం
- గురజాడ సాహిత్యం – సామాజిక చింతన, సామాజిక చైతన్యం మరియు పరివ్తర్తన
- గురజాడ సాహిత్యం – సాంస్కృతిక వైవిధ్యం, సాంస్కృతిక పరివర్తన మరియు అధ్యయనం
- గురజాడ సాహిత్యం – సోదర భారతీయ భాషా సాహిత్యాలతో తులనాత్మక అధ్యయనం
- గురజాడ సాహిత్యం – పాశ్చాత్య సాహిత్య ప్రభావం, స్వీకరణ మరియు స్వదేశీకరణ
- గురజాడ సాహిత్యం – పాశ్చాత్య మరియు ప్రపంచ సాహిత్యంతో తులనాత్థక అద్యయనం
- గురజాడ సాహిత్యం – అనువాదం, పునర్వ్యాఖ్యానం మరియు అంతర్జాతీయీకరణ
- గురజాడ సాహిత్యం – స్త్రీ చైతన్యం, లింగ అద్యయనం మరియు సామాజిక న్యాయం
- గురజాడ సాహిత్యం – భాష, వ్యావహారికత మరియు సాహిత్య ఆధునికత
- గురజాడ సాహిత్యం – సంప్రదాయాలు – ఆధునిక అనువర్తనాలు
- గురజాడ సాహిత్యం – మీడియా అధ్యయనం (రంగస్థల ప్రదర్శనలు, సినిమా/దృశ్య మాధ్యమ రూపాంతరీకరణలు)
- గురజాడ సాహిత్యం – సమకాలీనత, ప్రపంచీకరణ మరియు డిజిటల్ హ్యుమానిటీస్
| సదస్సు సంచాలకులు | పోషకులు | సమన్వయ సంఘం |
| డాక్టర్ కప్పగంతు రామకృష్ణ వైస్ ప్రిన్సిపాల్, కె.బి.ఎన్. కళాశాల, విజయవాడ డాక్టర్ కొవ్వలి గోపాలకృష్ణ (అమెరికా) సంపాదకులు, ప్రకాశిక | ప్రధాన పోషకులు శ్రీమతి గురజాడ అరుణ, వ్యవస్థాపక అధ్యక్షులు, గురజాడ ఫౌండేషన్ (అమెరికా) డాక్టర్ టి. శ్రీనివాసు కార్యదర్శి, కె.బి.ఎన్. కళాశాల పోషకులు డాక్టర్ జి కృష్ణవేణి ప్రిన్సిపాల్, కె.బి.ఎన్. కళాశాల | డాక్టర్ జి.నాగరాజు (తెలుగు విభాగిపతి) డాక్టర్ పి. పవన్ కుమార్ రెడ్డి శ్రీమతి ప్రఖ్య నాగరేఖ డాక్టర్ జె. వి. చలపతి రావు |
గురజాడ కథలు, కవితలు, వ్యాఖ్యాన సహితంగా గురజాడ ఫౌండేషన్ (అమెరికా) ప్రచురించింది. కావలసినవారు 9032593153 నెంబరుకి మెసేజ్ చేసి సంప్రదించండి.


