13.3 C
New York
Sunday, May 24, 2026

మహాకవి గురజాడ అప్పారావు స్మారక కథల పోటీ – 2026

గురజాడ ఫౌండేషన్ (అమెరికా) వారిచే ప్రచురింపబడుతున్న అంతర్జాల తెలుగు పత్రిక ‘ప్రకాశిక‘ నిర్వహిస్తున్న గురజాడ అప్పారావు స్మారక కథల పోటీకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న 18–45  సంవత్సరాల మధ్య వయసు గల తెలుగు వారినుంచి కథలు ఆహ్వానిస్తున్నాం.

“దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా” అని నినదించిన గురజాడ అప్పారావు గారు తెలుగు సాహిత్యానికి కొత్త దిశను చూపారు. సమాజపు వాస్తవాలను నిర్భయంగా చెప్పడమే ఆయన రచనలలోని గొప్పతనం.

–చదువు పూర్తయింది, కానీ భవిత కనపడలేదు. ఉద్యోగ ప్రకటనలు వస్తున్నాయి, బయోడేటా సవరిస్తూనే ఉన్నారు యువత. అమ్మకి విరామం ఇస్తామని, అయ్యకి ఆసరా అవుతామని నమ్మిన యువత  లేచి, తన భవితను తానే సృష్టించుకునే ఉత్తేజం పొందాలి. “భవితా, ఓ భవితా” అనే కవితలో దాగిఉన్న అంశాల ఆధారంగా రాసిన కథలను పోటీకి ఆహ్వానిస్తున్నాం. కవిత పూర్తి పాఠం ప్రకాశిక పత్రికలో చూడవచ్చు.

బహుమతి పొందిన మరియు సాధారణ ప్రచురణకు ఎంపకైన కథలు ప్రకాశిక అంతర్జాల పత్రికలో ప్రచురితమవుతాయి.

నిబంధనలు:

కథల నిడివి 1200 పదాలకి మించరాదు. మీ రచనమీద సర్వహక్కులూ మీవే. కానీ దయచేసి ఇంకెక్కడైనా పరిశీలనలో ఉన్న కథలు, ఇది వరకు ప్రచురించబడిన రచనలు మరో రూపంలోనూ పంపించవద్దు. ఒక రచయిత ఒక కథ మాత్రమే పంపాలి.

మీ రచనతోపాటు అది మీ స్వీయ రచన అని, దేనికీ  అనుకరణ, అనుసరణ కాదని, మరే ఇతర సామాజిక మాధ్యమాలలోనూ, అంతర్జాల పత్రికలలోనూ ప్రచురితం కాలేదని, అలాగే పరిశీలనలో కూడా లేదని, 18–45 సంవత్సరాల మధ్య వయసు గల వారని హామీ పత్రం విధిగా జతపరచాలి.

మీ రచనలో ఎవరినీ కించపరిచే వ్యాఖ్యలు గానీ, విమర్శలు గానీ ఉండకూడదు.

కేవలం యూనికోడ్ (గూగుల్, లేఖిని మొదలైన వెబ్ సైట్లలో టైపు చేసే ఫాంట్ (గౌతమి మొదలైన ఫాంట్స్) లో టైపు చేసిన రచనలు మాత్రమే పరిశీలించబడతాయి. PDF, స్కాన్ చేసిన వ్రాత ప్రతులు పరిశీలించబడవు.

మీ రచన పంపించేముందు అచ్చుతప్పులు లేకుండా పంపించండి.

ఐదు వాక్యాలకు మించకుండా మీ వ్యక్తిగత, సాహిత్య పరమైన విశేషాలు, తప్పక  జతపరచాలి.

కథల పోటీకి నిర్దేశించిన గడువును పొడిగించేందుకు కానీ, పరిశీలనకు వచ్చిన కథల అర్హతను బట్టి బహుమతులలో మార్పులు చేసేందుకు కానీ నిర్వాహకులకు అన్ని హక్కులు ఉన్నాయి.

కథల ఎంపికలో తుది నిర్ణయం నిర్వాహకులదే. ప్రచురణకి సంబంధించిన అన్ని విషయాలలో సర్వ నిర్ణయాధికారాలు పత్రిక సంపాదకులవే.

పోటీకి మీ రచన పంపవలసిన ఈ-చిరునామా: [email protected].

సబ్జెక్ట్ లైన్ లో ‘ప్రకాశిక గురజాడ అప్పారావు స్మారక కథల పోటీ కోసం’ అని రాయండి.

కథలు పంపించడానికి చివరి రోజు : 15 ఆగస్టు 2026

అన్ని విషయాలలోనూ మమ్మల్ని సంప్రదించవలసిన ఈ-చిరునామా: [email protected]

Vote this article
Prakasika
Author: Prakasika

Related Articles

Latest Articles