గురజాడ ఫౌండేషన్ (అమెరికా)
మహాకవి శ్రీ గురజాడ అప్పారావు స్మారక వ్యాసరచన పోటీ – 2026
డిగ్రీ కళాశాలలు, విశ్వవిద్యాలయాల విద్యార్థుల కోసం
ఏ విభాగానికి చెందిన విద్యార్థులైనా పాల్గొనవచ్చు
అంశం: “గురజాడ ఆలోచనలు, సాహిత్యం – నేటి ప్రాసంగికత”
మహాకవి గురజాడ అప్పారావు గారి 111వ వర్ధంతి సందర్భంగా గురజాడ ఫౌండేషన్ (అమెరికా) నిర్వహిస్తున్న తెలుగు వ్యాసరచన పోటీకి విద్యార్థినీ విద్యార్థుల నుండి వ్యాసాలను ఆహ్వానిస్తున్నాము.
వ్యాసాలు చేరవలసిన చివరి తేదీ
20 నవంబర్ 2026
బహుమతి ప్రదానం
ఆదివారం, 29 నవంబర్ 2026, హైదరాబాద్
బహుమతులు
ఉత్తమ వ్యాసాలుగా ఎంపికైన ఐదు వ్యాసాలకు ఒక్కొక్కదానికి రూ. 1,116/- నగదు బహుమతి, పతకం, ప్రశంసాపత్రం, గురజాడ ఫౌండేషన్ ప్రచురించిన గురజాడ కథల, కవితల ప్రత్యేక పుస్తకాలు.
పోటీలో పాల్గొన్నవారికి ప్రశంసాపత్రం, గురజాడ ఫౌండేషన్ ప్రచురించిన గురజాడ కథల, కవితల ప్రత్యేక పుస్తకాలు.
వ్యాసాలు ఎలా పంపాలి?
వ్యాసాన్ని PDF లేదా Word document రూపంలో [email protected] కు పంపాలి.
Email Subject: “2026 గురజాడ స్మారక వ్యాసరచన పోటీకి”
పోటీ నిబంధనలు
రచన పంపే ముందు ఈ వివరాలను జాగ్రత్తగా చదవండి
- వ్యాసం “గురజాడ ఆలోచనలు, సాహిత్యం – నేటి ప్రాసంగికత” అనే అంశంపై ఉండాలి.
- వ్యాసం తెలుగులో ఉండాలి. వ్యాసంలో అనువైన చోట మాండలిక పదాలు నిరభ్యంతరంగా ఉపయోగించవచ్చు.
- సరికొత్త రచనలను మాత్రమే పంపాలి. ఇంతకుముందు పత్రికలు, వెబ్సైట్లు, సామాజిక మాధ్యమాలు లేదా పుస్తకాలలో ప్రచురితమైన వ్యాసాలు పోటీకి అంగీకరించబడవు.
- వ్యాసం 2000 పదాలకు మించకూడదు.
- వ్యాసం ఎవరినీ కించపరిచే విధంగా ఉండకూడదు.
- ఒక రచయిత ఒక వ్యాసాన్ని మాత్రమే పంపాలి.
- వ్యాసం చివర రచయిత పూర్తి పేరు, ఫోన్ నంబరు, చదువుతున్న కోర్సు, సంవత్సరం, కళాశాల లేదా విశ్వవిద్యాలయం పేరు రాయాలి.
- ఈ వ్యాసం తమ స్వంత రచన అని, దేనికీ అనుకరణ లేదా అనుసరణ కాదని, 4! సాధనాలతో రాయలేదని, ఇంతకుముందు ఏ పత్రికకూ, ఏ పోటీకీ పంపలేదని, ఏ పత్రిక పరిశీలనలోనూ లేదని హామీ ఇవ్వాలి. హామీపత్రం విడిగా అవసరం లేదు.
- దూరప్రాంతాల నుండి కారులో పాల్గొనడానికి వచ్చే 25 మంది విద్యార్థులకు ఆర్థిక అవసరం ప్రాతిపదికన పాక్షిక ఆర్థిక సహాయం ఉంటుంది. ఎంపిక విషయంలో నిర్వాహకులడే తుది నిర్ణయం.
- ఎంపికైన వ్యాసాలను గురజాడ ఫౌండేషన్ (అమెరికా) త్రైమాసిక పత్రిక “ప్రకాశిక’లో ప్రచురించే అవకాశం ఉంది. ఇందుకు రచయితలు అనుమతి ఇవ్వవలసి ఊంటుంది.
- బహుమతులపై నిర్వాహకులదే తుది నిర్ణయం. వివాదాలకు తావు లేదు.
బహుమతి ప్రదాన కార్యక్రమం
- విజేతల పేర్లను ఆదివారం, 29 నవంబర్ 2026న హైదరాబాదులో జరిగే కార్యక్రమంలో ముఖ్య అతిథి ప్రకటిస్తారు. ఫలితాలను అంతకుముందు వెల్లడించడం జరగదు.
- కార్యక్రమ వివరాలు వ్యాసకర్తలకు తెలియచేస్తాము.
- బహుమతులు, పతకం, ప్రశంసాపత్రం కార్యక్రమానికి స్వయంగా హాజరైనవారికి మాత్రమే అందజేయబడతాయి. ఈ విషయంలో ఎలాంటి మినహాయింపు ఉండదు.
గమనిక: వ్యాసాల నాణ్యత నిర్వాహకులు ఆశించిన స్థాయిలో లేని పక్షంలో బహుమతులలో మార్పులు చేసే అధికారం నిర్వాహకులకు ఉంటుంది. ఈ విషయంలో
ఎలాంటి వివాదాలకు తొవు లేదు.
నిర్వాహకులు
డాక్టర్ కొవ్వలి గోపాలకృష్ణ, ప్రధాన సంపాదకులు, ప్రకాశిక
శ్రీమతి గురజాడ అరుణ, అధ్యక్షులు, గురజాడ ఫౌండేషన్
[email protected] :: www.prakasika.org

