2020 సంవత్సరంలో గురజాడ వర్ధంతి నాడు ప్రారంభమైన అంతర్జాతీయ, అంతర్జాల త్రైమాస పత్రిక ప్రకాశిక ఈ సంవత్సరం 6వ వార్షిక ప్రత్యేక సంచికను 2026 నవంబర్ నెలలో విడుదల చేయనుంది. ఈ సంచిక ముద్రిత గ్రంథంగా లభ్యమవుతుంది. ఈ ప్రత్యేక సంచికలో ప్రచురణకి ప్రామాణిక రచనలను ఆహ్వానిస్తున్నాము.
కథలు, కవితలు, సాధారణ వ్యాసాలు, సాహిత్య విమర్శనా వ్యాసాలు, అనువాదాలు వంటి ప్రక్రియలలో రచనలు పంపవచ్చు. ఒక రచయిత ఒక రచన మాత్రమే పంపాలి. సామాజిక స్పృహతో చేసిన రచనలు, గురజాడ సాహిత్యం మీద రాసిన వ్యాసాలకు ప్రాతినిధ్యం ఎక్కువ ఉంటుంది.
అయితే చర్విత చరణంలా పునరుక్తులు, పునరావృతాల కంటే, వారి రచనల్లోని నూతన ఆలోచనలను అన్వేషించేలా ఉండే రచనలకు ఎంపికలో ప్రాధాన్యం ఉంటుంది.
ఇంతకు ముందు ఎక్కడా ప్రచురితంకాని రచనలు మాత్రమే స్వీకరించబడతాయి. ఈ రచన ఇంతకు ముందు ఏ పత్రికలోనూ, వెబ్‌సైట్‌లోనూ, సంకలనంలోనూ ప్రచురితం కాలేదని, ఈ రచన ప్రస్తుతం మరే ఇతర పత్రికలో పరిశీలనలో లేదని హామీ పత్రం జతపరచాలి. రచయిత వివరాలు, సంక్షిప్త పరిచయం తప్పనిసరిగా పంపాలి.
కథలు వ్యాసాలు 3,000 పదాలకి మించకూడదు. కవితలు 30 లైన్లకు మించకూడదు. రచనలను యూనికోడ్ తెలుగు లిపిలో, వర్డ్ డాక్యుమెంట్ లేదా గూగుల్ డాక్ రూపంలో పంపించాలి. Pagemakerలో చేసిన రచనలు PDF తోపాటు ఓపెన్ ఫైల్ కూడా పంపాలి. ఎంపికైన రచనలు ISBN ఉన్న పుస్తక రూపంలో భద్రపరచబడతాయి. ఈ గ్రంథం అంతర్జాతీయంగా కూడా అందుబాటులో ఉంటుంది. వార్షిక సంచికలో ప్రచురణకు రచనలను ఎంపిక చేసే విషయంలో పూర్తి నిర్ణయం సంపాదకులదే. ఎంపిక విషయంలో ఎలాంటి ఉత్తరప్రత్యుత్తరాలకూ, వివాదాలకు తావు లేదు.
వార్షిక సంచికలో ప్రచురణకు ఎంపికకాని రచనలను, రచయితల ఆమోదంతో 2027వ సంవత్సరంలో రానున్న ప్రకాశిక సాధారణ సంచికలలో ప్రచురణకు పరిశీలించే అవకాశం ఉంది.
ముఖ్యమైన తేదీలు:
రచనలు సమర్పించుటకు చివరి తేదీ – సెప్టెంబర్ 15, 2026
ఎంపికైన రచయితలకు తెలియజేయు తేదీ – అక్టోబర్ 31, 2026
సబ్జెక్ట్ లైన్‌లో తప్పనిసరిగా “ప్రకాశిక 6వ వార్షిక సంచిక కోసం” అని రాయాలి.
రచనలు పంపవలసిన ఈ చిరునామా: [email protected]




గురజాడ ఫౌండేషన్ (అమెరికా) వారి