16.3 C
New York
Wednesday, May 15, 2024

జానపద సాహిత్య సౌరభం

– ఆచార్య ఎం. జయదేవ్, అతిధి సంపాదకులు

    అమెరికాలో ఉన్న ఆచార్య కొవ్వలి గోపాలకృష్ణగారు మాతృభూమిని మాతృభాషను మరచిపోకుండా ఆ రెండింటికి భాషా సాహిత్యాల పరంగా సేవ చేయాలనుకోవడం నిజంగా గొప్ప విషయం. భారతదేశంలో సొంత రాష్ట్రాల్లో ఉన్న తెలుగు వాళ్ళు తెలుగు భాష గురించి పట్టించుకోవడం లేదు. ఇది నిజంగా శోచనీయమైన విషయం. ఇతర రాష్ట్రాలకు ఇతర దేశాలకు వలస వెళ్ళిన వారు తమ మాతృభూమి పట్ల
    మాతృభాష వట్ల మమకారం ప్రదర్శిస్తున్నారు. “వ్యక్తి విలువ ఆవ్యక్తి దూరమైనప్పుడు తెలుస్తుందని” పెద్దలు అంటుంటారు. అలాగే మాతృభాష మాతృ భూమి విలువ, గొప్పతనం వాటికి దూరంగా ఉన్నప్పుడు
    తెలుస్తాయనుకుంటాను. ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో ఉన్న తెలుగువారు తమ భాషా సాహిత్యాలను సంస్కృతీ సంప్రదాయాలను మరచిపోకుండా కాపాడుకుంటూ వస్తున్నారు. ఇది అభినందించదగిన విషయం.

    గోపాలకృష్ణ గారు గురజాడ స్థాపించిన “ప్రకాశిక” పత్రికని వునరుద్ధరించి, తెలుగు సాహిత్యంలోని ఒక్కొక్క ప్రక్రియను గురించి ఒక్కొక్క ప్రత్యేక సంచికను తీసుకుని రావాలని సంకల్పించడం అభినందించదగ్గ విషయం. ఇందులో భాగంగా జానపద సాహిత్యానికి సంబంధించిన నంచికను చూడవలసిందిగా నాకు అప్పగించారు. ద్రావిడ విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా వని చేస్తున్న శ్రవణ్‌ కుమార్‌గారి ద్యారా గోపాలకృష్ణ గారు నాకు వరిచయమయ్యారు. జానవద సాహిత్యానికి సంబంధించి పది వ్యాసాలు నిష్జాతులైన వారితో రాయించి ఒక మంచి సంచికను తీనుకొని వద్దామని వారు చెప్పారు నా ఆరోగ్యం అంత బాగా లేకపోయినప్పటికీ వారి ఆసక్తిని చూసిన తర్వాత నేను వారితో కలిసి వని చేయడానికి అంగీకించాను.

    జానపద సాహిత్యం నముద్రం లాంటిది. ఇందులో అనేక శాఖోపశాఖలున్నాయి. జానవద సాహిత్యంలో ప్రధానంగా కవిత్వం, వచనం అనే రెండు శాఖలు ఉన్నాయి. కవిత్వంలో గేయం, కధాగేయం అనే రండు ఉవశాఖలున్నాయి. గేయంలో శ్రామిక గేయాలు, స్త్రీల గేయాలు, పిల్లల గేయాలు, కౌటుంబికగేయాలు. శృంగార గేయాలు, హాస్య గేయాలు, వేడుక పాటలు, కరుణ రస గేయాలు, పారమార్థిక గేయాలు మొదలైన
    అనేక ఉవ శాఖలుజన్నాయి. వీటన్నింటిలోనూ మళ్లీ ఉవశాఖలున్నాయి.

    కధాగేయంలో చిన్న కధాగేయాలు, పెద్ద కధాగేయాలు, కధాగేయచక్దాలు అనే మూడు శాఖలున్నాయి. చిన్న కథాగేయాల్లో పౌరాణీకాలు, మతనంబంధాలు, అద్భుత రన ప్రధానాలు, చారిత్రకాలు, సాంఘికాలు అనే ఐడు శాఖలున్నాయి. ఈ శాఖలన్నింటిలోనూ మళ్లీ ఉవశాఖలున్నాయి. ఉవశాఖలన్నింట్లోనూ మళ్ళీ అనేక ఉపశాఖలున్నాయి. పెద్ద కధ గేయాల్లో గూడా పొరాణికాలు, మతనంబంధాలు, అద్భుత రన వ్రధానాలు, చారిత్రకాలు, సొంఘికాలు అనే ఐడు శాఖలున్నాయి. ఈ ఐదింటిలోనూ అనేక ఉవశాఖలున్నాయి. ఈ ఉవ కాఖల్లో కూడా మళ్ళీ అనేక ఉవ శాఖలున్నాయి. కధాగేయచక్రాల్లో పౌరాణికాలు. చారిత్రకాలు, సాంఘికాలు అనే మూడు విభాగాలున్నాయి. ఇలా జూనవద కవిత్వం అనేక శాఖోపశాఖలుగా విస్తరించింది.

    జానపద వచనంలో కథలు, ఐతిహ్యాలు, పొడువు కథలు, సామెతలు అనే నాలుగు, విభాగాలున్నాయి. కథల్లో అద్భుత కథలు, నీతి కథలు, ప్రాణి కథలు, కారణ కథలు, హాస్య కథలు, స్త్రీల కథలు, పేదరాశి పెద్దమ్మ కథలు, మోసగాండ్ర కథలు, వురాణ కథలు, ఐతిహాసిక కథలు, శృంగార కథలు, బూతు కథలు మొదలైన విధంగా అనేక రకాల కథలున్నాయి. వీటన్నింటిలోనూ ఉవవిఖాగాలున్నాయి.

    పొడువు కథలను సంస్కృతంలో వ్రహేళికలు అంటారు. ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి గారు పొడువుకథలను గృహ జీవన ప్రహేళికలు, క్రామికజన ప్ర హేళికలు, ప్రకృతి సంబంధ వ్రహేళికలు, తిర్యక్‌ సంబంధి ప్రహేళికలు, క్రీడా వినోద ప్రహేళికలు, తాత్విక ప్రహేళికలు, ఆస్పస్ట వ్రహేళికలు, ఆత్మాశ్రయ ప్రహేళికలు, శాస్త్ర విజ్ఞాన ప్రహేళికలు, పిల్లల వ్రహేళికలు అని వది రకాలుగా వర్గీకరించారు. వీటన్నింటిలోనూ ఉవవిభాగాలున్నాయి.

    సాహిత్య ప్రక్రియల్లో తలమానికమైనది సామెత. అల్పాక్షరాల్లో అనల్పార్దాన్ని తెలిపే గొప్ప ప్రక్రియ సామెత. సామెతలు జాతి జీవన సర్వస్వాన్ని తెలియజేస్తాయి. సామెతల్లో అనేక రకాల సామెతలున్నాయి. సామెతలను జానపద విజ్ఞాన వేత్తలు వివిధ రకాలుగా వర్గీకరించారు. ఆచార్య జీ.ఎస్‌. మోహన్‌ గారు సామెతలను నూత్రవు సామెతలు, ఉపమాన రూవక సామెతలు, నీతి బోధక సామెతలు, పొరాణిక సామెతలు, ప్రశ్నార్థకరూవ ప్రశ్నోత్తర సామెతలు, సాంఘికాచార వ్యవహారాలు విశ్వాసాలు నమ్మకాలు వున్న సామెతలు, వ్యక్తిగత సామెతలు, హాస్యవు సామెతలు, శబ్దాలంకార సామెతలు, అళ్లీల సామెతలు, న్యాయ సామెతలు, వైద్యవు సామెతలు, స్థలనామాలతో కూడిన సామెతలు, గృహజీవన సంబంధమైన సామెతలు, మాదిరిసామెతలు అని సామెతల్లోని ఇతివృత్తాన్ని ఆధారంగా చేసుకొని వర్గీకరించారు. వీటన్నింటిలోనూ ఉపవిభాగాలున్నాయి.

    జానపద సాహిత్యంలో వురాగాథలు అనే ప్రక్రియ ఉంది. ఈ ప్రక్రియ కవిత్వ రూవంలోనూ వచనంలోనూ కూడా ఉంది. ఇందులో కూడా అనేక శాఖలున్నాయి. ఆ శాఖల్లో ఉప శాఖలూ ఉన్నాయి.

    ఈ విధంగా జానవద సాహిత్యం అనేక విభాగాలతో, ఉవవిభాగాలతో మహాసముద్రంలాగా విస్తరించింది. ఇలా విస్తరించిన జానవద సాహిత్యాన్ని పది వ్యాసాల్లో చెప్పడం ఎంత కష్టమో విజ్ఞులకు తెలియంది కాదు. అవకాశమున్నంతలో ముఖ్యమైన అంశాలను గురించి ఈ సంచికలో తెచ్చే ప్రయత్నం చేశాం.

    జానవద గేయాల్లో 70 శాతం శ్రామిక గేయాలున్నాయి. గ్రామీణులు కష్టజీవులు. గ్రామాల్లో ప్రధాన వృత్తి వ్యవసాయం. వ్యవసాయంలో దుక్కి దున్నడం, కలువు తీయడం, నాట్లు వేయడం, ఏతాం వేయడం, కోత కోయడం, తూర్పారబోయడం మొదలైన అనేక రకాల పనులున్నాయి. అలాగే రాట్నం తిప్పడం, తిరగలి తిప్పడం, బరువు లాగటం, వడవ వేయడం మొదలైన ఎన్నో రకాల వనులను జానవదులు చేస్తున్నారు. ఈ అన్నిరకాల వనులకు ప్రత్యేకమైన జానవద గేయాలున్నాయి. మొదటి వ్యాసం శ్రామిక గేయాల మీద శ్రవణ్‌ కుమార్‌ గారు రాశారు. శ్రవణ్‌ కుమార్‌ గారూ జానవద విజ్ఞానం మీద మంచి వరిశోధన చేస్తున్నారు.

    మన సమాజంలో నగం జనాభాగా ఉన్న స్త్రీలకు జానవద సాహిత్యంలో సముచిత స్థానముంది. జానవద గేయాల్లో ప్రత్యేకంగా స్త్రీల గేయాలున్నాయి. స్త్రీల గేయాల్లో సంతాన సంబంధమైన గేయాలు, వేడుకలు వినోదాలకు సంబంధించిన గేయాలు, నోములు వ్రతాలకు సంబంధించిన గేయాలు మొదలైనవి ఎన్నో ఉన్నాయి. జానవద సాహిత్యంలో పారమార్థిక గేయాలకు ప్రత్యేకమైన స్థానం ఉంది. పరమార్ధం అంటే ముఖ్యమైన ప్రయోజనం. మానవ జీవితానికి పరమార్థం మోక్షాన్ని పొందడం. మానవ జీవితంలో మోక్షం పొందడం ముఖ్యమైనది కాబట్టి పారమార్థిక గేయాలను గురించి ఈ సంచికలో రాయించాం. స్త్రీల గేయాలు పారమార్థిక గేయాలను గురించి బద్రి కూర్మారావు గారు రాశారు. బద్రి కూర్మారావు గారు ఉత్తరాంధ్ర ప్రాంతంలోని జానవద విజ్ఞానం మీద మంచి పరిశోధన చేస్తున్నారు.

    తంగిరాల వెంకట సుబ్బారావు గారు కథాగేయాల మీద విశేషమైన వరిశోధన చేశారు. వీరు కథాగేయాలను వీరగాథలు అన్నారు. కథాగేయాలను గురించి తంగిరాల సుబ్బారావు గారు రాశారు.

    ఐతిహ్యాల మీద ఆచార్య పేట శ్రీనివానులు రెడ్డి గారు మంచి వరిశోధన చేశారు. వురాగాధలు ఐతిహ్యాల మీద శ్రీనివాసులురెడ్డి గారు రాశారు. అద్భుత కథల మీద వులికొండ సుబ్బాచారి గారు మంచి వరిశోధన చేశారు. వారు అద్భుత కథల మీద వ్యానం రాశారు. కారణ కథల గురించి జయదేవ్‌ రాశారు.

    మహాభారతం తెలుగువారికి చాలా ఇష్టమైనది. భారతంలో జానవద విజ్ఞాన అంశాలు చాలా ఉన్నాయి. ఇందులో అద్భుత కథలు, ప్రాణికథలు, నీతికథలు, కారణ కథలున్నాయి. ఈ కథలన్నింటి మీద జానవద కథల వ్రభావం ఉంది. మహాభారతంలోని ప్రాణికథల మీద ఉన్నజానపద సాహిత్య వ్రభావం గురించి డాక్టర్‌ తరపట్ల సత్యనారాయణ గారు రాశారు. వీరు జానవద విజ్ఞానం మీద మంచి వరిశోధన చేస్తున్నారు.

    సామెతల మీద ఆచార్య జి. ఎస్‌. మోహన్‌ గారు విశేషమైన వరిశోధన చేశారు. వారు సామెతల మీద రాశారు. ఆచార్య పగడాల చంద్రశేఖర్‌ గారు జానవద విజ్ఞానం మీద మంచి పరిశోధన చేస్తున్నారు. వారు పొడువు కథల మీద రాశారు.

    జానవద సాహిత్య ప్రభావం సినిమా పాటల మీద చాలా ఉంది. పైడిపాల వేణుగోపాల రెడ్డి గారు ఈ అంశం మీద వరిశోధన చేశారు. వారు జానవదం – సినీ వథం అనే పేరుతో సినిమా పాటల మీద జానవద సాహిత్య ప్రభావం గురించి రాశారు.

    ఈ నంచికకి “జానవద సాహిత్య సౌరభం” అన్న సముచితమైన పేరు పెట్టాము. సాహిత్య చందనం, జానవద సౌరభం కలగలిపి జ్ఞానానందం కలిగించే ఎన్నో వ్యాసాలు ఈ సంచికలో ఉన్నాయి. ఈ సంచికను తీసుకొని రావడంలో గోపాల కృష్ణ గారితో కలిసి వని చేసినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. ఈ విషయంలో నాకు అవకాశం కలిగించినందుకు గోపాలకృష్ణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.

    5/5 - (1 vote)
    Prakasika
    Author: Prakasika

    Related Articles

    Latest Articles