16.8 C
New York
Tuesday, May 14, 2024

ఫోను

ఫోను

-హాస్య-వ్యంగ్య ప్రకాశిక

ఫోనుకీ భారతీయులకీ, అందులోనూ తెలుగువాళ్ళకీ మోగీమోగని ఫోనుకి అవినాభావ సంబంధం ఉంది. ఆ ఒక్కసీన్కో సం విశ్వనాథ్ గారి సినిమా (స్వర్ణకమలం) చూసినవాళ్ళు వేవేలమంది ఉన్నారంటే అతిశయోక్తి కాదేమో (ఆయ్….ఇనపడతాందా ఆండీ … ఆయ్….). ఫోన్‍కీ నాకూ కూడా సంబంధం ఉందండీ. లేకపోతే ఎందుకు రాత్తానండీ. కథలో ‘నేను’ లేకపోతే కథ ఎలా పుడుతుందండీ!
ఫోన్లో మాటాడుతూ ఆఫీసులో కుర్చీలో కూర్చుని ఫోటోలు తీయించుకునేవాళ్ళు, సెల్ఫోనులో మాట్లాడుతూ ఫోటోలు తీయించుకునే వాళ్ళు, నడుస్తూ నడుస్తూ, ఏదో సభలో మాట్లాడుతున్నప్పుడు, లేక మాట్లాడుతున్నట్లు ఫోటోలు దిగి ఫేస్బుక్కి అంకితమిచ్చేవాళ్ళు, సభలో స్టేజిమీద, ఆడియన్స్ లోనో ఉంటూ ఫోనులో మాట్లాడుతున్నట్లున్న ఫోటోలు ప్రొఫైలు పిక్చర్గా పెట్టుకునేవారూ, సభలో ప్రసంగిస్తుంటే అత్యవసరంగా వచ్చిన ఫోనులో “ఎప్పుడు అఘోరిస్తున్నారు?


ఈ రాత్రయినా మగాడిలా వస్తారా లేక మృగాడిలానా?” అని గదవాయింపు గొంతు వినపడినా, తాను ఎంత బిజీగా ఎడతెరిపిలేని ఫోన్ కాల్స్ తో ఉంటాడో తెలిపేందుకు ఫేస్బుక్లో వీడియోపోస్ట్ చేసేవారూ… ఇలా ఎందరో ఫోన్ బాంధవ్యులు, బాధితుల కథలు, కథనాలు, విశేషాలు మనకి చాలా తెలుసు. నా చిన్నప్పుడు అంటే ముద్దు మొహానికి, మొద్దు మొహానికీ, తేడా తెలిసే వయసు, అరవై నాలుగేళ్ళ సంగతి. మా ఇంట్లో ఒక విభాగంలో పోస్ట్ ఆఫీసు ఉండేది. సుమారు పదివేలమంది ఉండే గ్రామానికి అది పెద్ద పోస్టాఫీసు. అందులో పోస్ట్ కార్డులూ, ఇంగ్లాండ్ (inland) కవర్లు లాంటివి అమ్మడంతో పాటు ట్రంక్ కాల్స్చే సుకునే సౌకర్యం కూడా ఉండేది. కన్నాల్లో ఉండే అంకెల్లోవేలుపెట్టి టిప్ టిప్.

మని తిప్పిరిసీవర్ని చెవిలో పెట్టుకుని అలిసిపోయే వరకు అరిచే వాళ్లందరినీ చూశాను.
ఎవరూ అవతలి నుంచి పలికి పలకరించకపోతే నిస్సహాయంగా విడిచిన నిట్టూర్పులు
చాలా విన్నాను. అవతలి గొంతు వినిపించక, మాట్లాడుతుంటే తెగిన తీగలూ,
బంధాలు, పగిలిన ఎదల రొదలు విన్నాను. ఇంతకీ “నీకు పనీపాటా, చదువు సంధ్య,
బడీ దడీ లేవా” అని మీరు అడగవచ్చు. పల్లెటూరులో పాకబడిలో చదివే నాకు ఎండకీ
వానకీ వచ్చే సెలవులు, జనాభాలెక్కలకీ జాతరకీ వచ్చే సెలవులతో ఏమి చేయాలో
తెలియక, ఏమీ తోచక అరుగుమీద కూర్చునే అవకాశం తప్ప వేరే అవకాశం లేని
నాకు పక్కనే ఉన్న పోస్టాఫీసులో జరిగే తంతు, తతంగాలు పరికించడం
ఎంటర్టైన్‍మెంట్గాను ఎడ్యుకేషనల్ గాను ఉండేది. కొంచెం వర్షం పడితే చాలు
ఫోను మూగబోయేది. పోస్ట్ మాస్టర్కి మూడ్ బాగోపోతే ఫోను సానుభూతిగ
మౌనవ్రతం చేసేది. తరుచూ ట్రంక్ కాల్ చేయడానికి వచ్చేది మా ఊరి సర్పంచ్
మంచిగంధం సుబ్బారావు గారు మాత్రమే. ట్రంక్ కాల్ బుక్ చేసి కాల్ వచ్చేవరకు
పట్టువదలని విక్రమార్కుడిలా అరుగుమీద, నాకు ఆవల పక్కన
కూర్చొనేవాడు. ఆయన దగ్గర నుండి వచ్చే గంధం ఏమిటో
అప్పుడు తెలిసేది కాదు గానీ అది సురనిశ్వాస అని పెద్దయ్యాక
అనుభవంతో తెలిసింది. ఆయన ఫోన్లో ఘాటుగా మాట్లాడు
తుంటే చాటుగా వినే నాకు పదకోశ అభివృద్ధి, సంస్కారోన్నతి
కలిగేవి! వాటిని తరువాత బడిలోనూ, ఇంట్లోనూ ఉపయోగిస్తే
ఎందుకు శిక్ష పడేదో అనుభవం ద్వారా తెలిసింది.
రాజీవ్‍గాంధీ, పి.వి నరసింహారావుగార్ల ధర్మంతో విరివిగా,


విస్తృతంగా అందరికీ ఫోన్లు లభ్యమయ్యే
కాలానికి, ఎక్కడో ఎవరికో (డబ్బు, దర్పం
ఉన్న) ఫోన్ ఉండే కాలానికీ మధ్య ఉన్న
సంధికాలంలో పెరిగిన నాకు వింత అనుభ
వాలు ఎదురయ్యేవి. ఫోన్ ఉన్నవాళ్ళు ఉన్నత
వంశ దీపికలని భావించేవాళ్ళు. అలా
ఆలోచించే వాళ్ళ కోవలో నేనూ ఉండేవాడిని.
పెళ్ళంటూ చేసుకుంటే ఫోన్ ఉన్నవాళ్ళ
అమ్మాయినే చేసుకుంటానని మనసులో
శపథం చేసుకున్న వైనం ఇంకా గుర్తు ఉంది.
విధి సహకరించడంతో ఆ నిర్ణయానికి
కట్టుబడలేదు కాబట్టి సరిపోయింది. లేకపోతే
పనిచేయని ఫోన్ పెట్టుకుని బిల్డప్ ఇచ్చే.

రాయుడిగారికి అల్లుడిని అయ్యే వాడిని. కొంచెం ముందుకు వెడితే, చదువూ/ అమెరికాలో H1B ఉద్యోగం, అన్ని హంగులూ ఉండే అపార్ట్మెంట్, అందులోనూ అడిగిందే తడవుగా, పోటీపడి ఫోన్ కనెక్షన్ ఇచ్చే MCI లాంటి కంపెనీలు; వీటిని చూసే సరికి గాలికొట్టి వదిలిన బుడగలాంటి అనుభూతి కలిగేది. ఫోనాధి పతినన్న గర్వం, దర్పం కొత్తల్లో కొంత ఉండేవని చెప్పడానికి సిగ్గుపడ్డా అది వాస్తవం. మంచం పక్కన, సోఫా పక్కన చేతికందిన ఫోనులో దర్జాగా అయిన వాళ్ళతో, కాబోయే వాళ్ళతో మాట్లాడుతుంటే ఎల్లలు లేని ఆనందానికి అధిపతిగా ఫీల్అ య్యేవాడిని. అమెరికా వచ్చిన ఆరువారాలకి వచ్చిన ఫోన్ బిల్లు చూసి ఉక్కిరిబిక్కిరి అయి దిక్కుతోచక “ఇది నిజమా” అన్న సంభ్రమాశ్చర్యాలతో జారిపోతుందేమోనన్న గుండెని జారిపోనీయకుండా తమాయించుకున్న రోజులు గుర్తున్నాయి. కటింగ్స్ అన్నీ పోను చేతికొచ్చే నెలసరి ఆదాయం రెండువేలల్లోవెంటనే కట్టవలసినది 1100
డాలర్లు. మిగిలిన దానితో ఇంటి అద్దె, కరెంటు, కిరాణా సామాను, బయట తిండి,
ఏపుగా ఆడక్కుండా పెరిగే జుట్టు కత్తిరింపు (అమెరికాలో జుట్టు కత్తిరించే వ్యక్తికి కూడా
ఒక స్థాయి ఉంటుంది) మొదలయినవి. ఎంత గొప్ప ఆర్థిక శాస్త్రవేత్త అయినా 900 లో
నెల జీవితం కుదించడం అసాధ్యం. అప్పుడే అందొచ్చింది అమెరికన్ ఎక్స్ప్రెస్ కార్డు.
అప్పుకాని అప్పు, ఘరానా అప్పు. కార్డు వాడాను. నెలరోజులు వెసులుబాటు దొరికింది.
రాబోయే నెల గురించి అప్పుడే మొదలైన ఆందోళనతో కష్టపడి ఉగ్గబట్టుకుని ఫోన్కి
దూరంగా ఉండేవాడిని. అయినా కాబోయే వారితో కలపడం కోసం అయినవారు చేసే
ప్రయత్నం, ఎవరితోనో బంధం పెంచుకోవాలనే ఆతృత, ఫోనున్న ఆసామిననే
అభిప్రాయం కల్గించాలన్న ఉత్సాహం; ఇదీ డోలాయమాన మనస్థితి.
ఫోను బిల్లుకీ, వాస్తవానికీ మధ్య సంఘర్షణ రాస్తే అమెరికోపనిషత్తు కావచ్చు.
గోడకి తగిలే తీగల ఫోను నుంచి తీగలవసరం లేని సెల్ఫోన్ యుగంలోకి
ప్రవేశించినప్పుడు ఆ అనుభూతి వేరు. ఎప్పుడైనా, ఎక్కడనుంచైనా, ఎవరితోనైనా
మాట్లాడవచ్చనే స్వతంత్రభావన అద్వితీయం. కానీ నిమిషాలని డాలర్లలోకి మార్చే
వ్యవస్థ అది. ఆ రోజుల్లో అమ్మ, అయినవాళ్ళు, ఆత్మీయంగా, అనంతంగా
మాట్లాడేవారు. నా గుండె నిమిషానికి యాభై సెంట్స్(25 రూపాయలు) వేగంతో
కొట్టుకునేది. బిల్లు కట్టే సమయానికి కళ్ళు ఆర్ధ్రతతో చెమర్చేవి. కొండకచో,

బాష్పధారలు కురిసేవి. ఆ యుగం గడిచి మాట్లాడినంత మాట్లాడవచ్చనే ప్రణాళికలు
వచ్చాయి. అమ్మతో, ఆప్తులతో మనసారా కాలనియంత్రణ లేకుండా మాట్లాడవచ్చని
ఆనందించా. ఇప్పుడు అమ్మ తక్కువగా మాట్లాడుతుంది. ఆప్తులనుకున్న వారు
వాట్సప్లో “హాయ్” చెబుతారు, చేతులు జోడిస్తారు. వేళ్ళు, చేతులు పైకి పెడతారు.
ఇప్పుడు ఫోన్ అవసరం లేదు. మాటల మాధ్యమం ఇంకిపోయింది. ఎమోజీలతో
భావప్రకటనలు చేసే అవకాశం రావడంతో, మాటలు రాసే అవసరం అడుగంటింది.
మాట్లాడే గుణం చిన్నబోయింది.
మాట్లాడటం కోసం, సంక్షిప్త సమాచారం పంపిణీ కోసం, ఉపయోగపడే ఫోన్,
ప్రపంచాన్ని చేతికి తెచ్చే గడుసు ఫోనుగా మారింది. అపరిమిత సంక్షిప్త సమాచార
ప్రసారాలు, అనంతకాల మాటల అవకాశాలు అనతి కాలంలోనే అమలులోకి
వచ్చాయి. భారతదేశంలో జియో ఆగమనంతో మాటలు, అంతర్జాల గమకాలు
ధరాతీతం అయ్యాయి. ఆత్మీయతలు కుంచించాయి. అనుబంధాల తోరణాలు
తెగిపోయాయి. మాట్లాడటానికి విషయం లేదు, మాట్లాడే ఇచ్ఛ లేదు, మాటల్లో మమత
లేదు. గడియారంలో నిమిషాలున్నాయ్. నిమిషానికి వెలలేదు. మాటలున్నాయ్,
మాటల్లో మమత లేదు. మనిషికి మనిషి అవసరం లేదు. సాంగత్యం ప్రతిబంధకమైంది.
నిరాఘాటంగా, నిరంతరం దొరికే వస్తువులకి విలువ ఉండదు. అమితంగా దొరికే
తిండికి రుచి ఉండదు. బాహాటంగా చూపే అందంలో ఆకర్షణ ఉండదు. రోజూ వచ్చే
అతిథికి మర్యాద దక్కదు. ఎక్కువగా మాట్లాడే వారి మాటకి గౌరవం ఉండదు. కాల
నియంత్రణ లేని ఫోన్ వ్యవస్థకి విలువ ఉండదు.


Vote this article
Vishnu Vardhan
Author: Vishnu Vardhan

Related Articles

Latest Articles