21 C
New York
Sunday, April 28, 2024

కారా గారి సాహితీ జీవితం – దళిత దృక్పథం

– ఆచార్య ఎం. గోనా నాయక్‌

తెలుగు సాహిత్య ప్రపంచంలో కాళీపట్నం రామారావు పేరు తెలియని వారులేరు. తెలుగు అగ్రశ్రేణి కథకుల్లో కారాగారు ఒకరు. వీరు 1924, నవంబర్‌ 9న శ్రీకాకుళం జిల్లాలోని పొందుకూరు గ్రామంలో జన్మించారు. తల్లిదండ్రులు భ్రమరాంబ, పేర్రాజులు. వీరికి ఐదుగురు సంతానం. కారాగారు అందరికన్నా పెద్దవారు. తండ్రి పేర్రాజుగారు మురపాక గ్రామ కరణంగా పనిచేసేవారు. 1929 -_ 33 సంవత్సరాల మధ్య మురపాకలోని నాలుగవ తరగతి వరకు కారాగారు చదువుకున్నారు. ఆ గ్రామంలో గల రామకృష్ణ గ్రంథాలయంలోని పుస్తకాలతో సాన్నిహిత్యం పెరిగింది. ఆంధ్రపత్రిక, ఉగాది సంచికలు, నవలలు, నాటికాలు మనుచరిత్ర, వసుచరిత్ర వంటి అనేక రచనలు చదవడం వలన సాహిత్యంతో సాన్నిహిత్యం ఏర్పడి 14 ఏటనే ‘ముద్దు’ అనే పేరుతో కథ రాశారు. వీరికి చిత్రకళపై కూడా ఆసక్తి కలదు. ఠాగూర్‌, శరత్‌, గోపీచంద్‌, చలం, విశ్వనాథ, శ్రీపాద, కొడవటిగంటి కుటుంబారావు, జీవీ కృష్ణారావు ఆయన అభిమాన రచయితలు. 1943లో చిత్రగుప్త పత్రికలు, కార్డు కథలు శీర్షికతో కారాగారి ‘ఫ్లాట్‌ ఫారం’ అనే రచన వెలువడింది.

కారా మాస్ప్టారుగారికి 1946 మార్చి 19వ తేదీన సీతామహాలక్ష్మి గారితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు సుబ్బారావు, చిన్న కుమారుడు ప్రసాద్‌రావు. కారాగారు ప్రారంభించిన కథానిలయమును వీరు కొనసాగించడం గొప్ప విషయం.

కారాగారు. అనేక అవార్డులు అందుకున్నారు. ‘యజ్ఞం’ కథకు 1995లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు అవార్డు లభించింది. 2008 లోక్‌నాయక్‌ ఫౌండేషన్‌ అవార్డు అందుకున్నారు. ఎన్టీఆర్‌ జాతీయ పురస్కారం, బొమ్మిడాల _ కృష్ణమూర్తి ఫౌండేషన్‌ అవార్డు, కొండేపూడి _ శేషగిరిరావు సాహితీ పురస్కారం… ఇలాంటివి అనేక పురస్కారాలు అందుకున్నారు. ఆంధ్రభూమి దినపత్రికలు ‘నేటికథ’ శీర్షిక నిర్వహించారు. వీరి కథలు డిగ్రీ, పీజీ స్థాయిలో సిలబస్‌లోను చోటుచేసుకున్నాయి.

కారాగారు దాదాపు 50కి పైగా కథలు రాశారు. అవి 1. ప్తాట్‌ ఫారమో, 2. భాయిజాన్‌, 3. వీసంలో… అయితే గీతే, 4. వెళ్ళిపోయింది, 5. వెనక చూపు, 6. నిజమైతే, 7. ఏమిటిదంతా, 8. అడ్డం తిరిగిన చరిత్ర, 9. అదృశ్యము, 10. రేవతి నుంచి నవచైతన్యం, 11. బలహీనులు, 12. అవివాహితగానే ఉండిపోతా, 13. బలానికి లక్ష్యం, 14. రేవతి నుంచి దూరదృష్టి, 15. రేవతి నుంచి తల్లుల ప్రేమ, 16. ఆస్తుల రహస్యం, 17. జననిష్టురాలు, 18. నిరవాకాలు, 19. కీర్తి రాయుడు, 20. అప్రజాతం, 21. పెంపకపు మమకారం, 22. జయప్రద జీవనం, 23. పలాయితుడు, 24. సేనాపతి వీరన్న, 25. అభిశప్ప్తులు, 26. అశిక్ష విద్య, 27. తీర్పు, 28. ఇల్లు, 29. వధ, 30౦. యజ్ఞం, ఏ1. మహాదాశీర్వాదం, 32. వీరుడు మహావీరుడు, 33. ఆదివారం, 34. హేంస, 35. నోరూమ్‌, 36. స్నేహం, 37. ఆర్తి, 38. భయం, 39. శాంతి, 40. చావు, 41. జీవధార, 42. కుట్ర, 43. సంకల్పం, ॥…. అర్థం కాని మానవ గాథ, 45. అన్నెమ్మనాయురాలు, 46. రాగమయి, 47. అభిమానాలు, 48. ఆరు సారా కథలు, 49. జరీ అంచు తెల్లచీర, 50. రుతుపవనాలు వంటి అనేక కథలు రాశారు.

‘తెలిసిందా నేనెవరో’ అనే ఏకపాత్ర ఏకాంకిక రాశారు. ‘కథాకథనం’ అనే వ్యాస సంపుటిని వెలువరించారు. ‘రచన’ అనే పత్రికకు కొంతకాలం సంపాదకత్వం వహించారు. వీటితోపాటు ఆహ్వానం వేకువ జాము కలలు, ఇంతా చేస్తే, జాతిని చైతన్యవంతం చేయాలంటే, నేనెందుకు రాశాను, శ్రీశ్రీ మార్గం శ్రీశ్రీ కంటే గొప్పది, కథలు రాయడం గూర్చి వ్యాసాలు, యువ రచయితలకు కథ గూర్చి, కథలు ఎలా రాస్తారు, దీర్ష శృతి – తీవ్ర ధ్వని, రీడర్స్‌ నోట్‌, ఆత్మావలోకనం, గురుస్మరణ, ఉపాధ్యాయుడుగా నేను, నా గురించి నేను, నేను – నా జీవన దృక్పథం వంటి ఎన్నో వ్యాసాలు రాశారు.

కారాగారి కథలలో దళిత జీవితం, శ్రామిక, ఆర్థిక, మానవ విలువలు, మానసిక సంఘర్షణలు, మధ్యతరగతి జీవితాలను కళ్ళకు కట్టినట్లు చూపించారు. వీరు రచించిన “యజ్ఞం, ఆర్తి, చావు” కథలల్లో దళితుల జీవితాలు ఎంత దుర్భరంగా ఉన్నాయో చిత్రీకరించారు. “యజ్ఞం” కథ దళితులలో బడబాగ్నిని కళ్ళకు కట్టినట్లు వివరిస్తే “ఆర్తి” కథ సామాజిక స్పృహను, “చావు” కథ చైతన్యాన్ని రగిలించాయి.

తెలుగు కథారంగంలో “యజ్ఞం” కథకు ఒక ప్రత్యేక గుర్తింపుఉంది. ఈ కథ శ్రీకాకుళంకు కొంత దూరంలో గల సుందరపాలెం అనే గ్రామం చుట్టూ తిరుగుతుంది. ఆ ఊరితోపాటు అక్కడ ఉన్న వ్యక్తుల జీవన _ విధానాలను, మనస్తత్వాలను, ఉత్తరాంధ్ర మాండలిక భాషలో వివరించారు. ఈ కథలో దళిత రైతు అప్పల్రాముడు దళారి గోపన్న దగ్గర అవసరం కోసం కొంత సొమ్ము అప్పు తీసుకుంటాడు. ఏళ్ల తరబడి వడ్డీతో ఆ అప్పు చాలా పెరిగిపోతుంది. ఇవ్వటానికి అప్పల్రాముడు దగ్గర డబ్బులు ఉండవు. చివరికి ఈ సమస్య ఆ ఊరి పెద్దమనిషి శ్రీరాములునాయుడు దగ్గరకు చేరుతుంది. ఈలోపు అప్పలరాముడు అప్పును తామే చెల్లించి అతనితో వెట్టిచాకిరి చేయించుకోవడానికి కొందరు పెద్దలు పన్నాగం పన్నుతారు. ఎవరు ఏమి మాట్లాడినా అప్పల్రాముడు మాట్లాడడు ఏమి చేయాలో తెలియక చివరకు అప్పల్రాముడి అప్పును నేను తీరుస్తానంటాడు శ్రీరాములునాయుడు. అప్పుడు అప్పల్రాముడు నోరు విప్పుతాడు తరతరాల నుంచి జరుగుతున్న అన్యాయాలను, అక్రమాలను, థార్జన్యాలను, మోసాలను, దోపిడీలను పూసగుచ్చినట్లు చిట్టా విప్పి చెబుతాడు. ఈ మాటలతో ఊరి జనం చైతన్యవంతులవుతారు. అప్పల్రాముడు చెప్పింది నూటికి నూరుపాళ్ళు నిజమే కదా అనుకుంటారు. తన అప్పును తానే కొంచెం పొలం అమ్మి తీర్చుతానంటూ చెబుతాడు అప్పల్రాముడు కరణాన్ని పత్రం రాయించమంటాడు. అప్పల్రాముడు కొడుకు సీతారాముడు తండ్రి మాటలకు అడ్డుపడతాడు. బతికినంత కాలం చాకిరీ చేసి గోపన్న అప్పు తీరుస్తాను కానీ పొలం కాసింతైనా అమ్మడానికి వీలు లేదని ఖరాఖండీగా చెబుతాడు. తన మాటకు కట్టుబడి శ్రీరాములు అమ్మకం పత్రం మీద నిసాని వేసి కొడుకుల చేత నిసాని వేయిస్తాడు. తన కొడుకు తన లాగా జీవితాంతం ఊడిగం చేయడం ఇష్టం లేక సీతారాముడిని నరికి చివరికి గోతంలో వేసుకుని ధర్మ మండపం ముందు పడేస్తాడు అప్పల్రాముడు. దీంతో కథ ముగుస్తుంది.

తీర్పు న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా లేనప్పుడు తను ఏమీచేయలేని నిర్గారణకు వచ్చినప్పుడు ఫ్యూడల్‌ వ్యవస్థపై నిరసనగా, బానిస బతుకు మీద తిరుగుబాటుగా అప్పల్రాముడు తన కొడుకుని చంపుకుంటాడు. అతనిని అలాంటి కఠినమైన ఉన్మాదస్తాయికి తీసుకెళ్లిన పరిస్థితులను మనం “యజ్ఞం” కథలో చూస్తాం. మనిషి తను ఏమీ చేయలేనప్పుడు కోపం పెను తుఫానుగా పెళ్లుబికినప్పుడు తనను తాను హింసించుకుంటాడు అదొక ఉన్మాద స్థితి. పరిస్తితులు తారుమారైనప్పుడు తాను అనుకొన్నది అనుకొన్నట్లుగా జరగనప్పుడు కలిగే పరిస్థితి ఇలా ఉంటుంది. ఈ కథ ముగింపులో మనం అదే చూస్తాం. బానిసగా జీవితాంతం వెట్టిచాకిరీ చేస్తూ ఈ సమాజంలో ఏ ఒక్కడు బతకకూడదు అలా అనే విషయాన్ని కథకుడు బలంగా చెప్పాడు. సమాజంలో ఆర్థిక సామాజిక వ్యత్యాసాలు ఏర్పడడానికి గల కారణాలను విశ్లేషణాత్మకంగాను, వివేచనాత్మకంగా ఈ కథను రాశారు.

కథను దళితుల జీవన నేపథ్య ఆధారంగా రాశాడు. ఈ కథలో దళితులు సామాజిక జీవన దృక్పథాన్ని గురించి వివరించాడు. దీనిలో వారి సామాజిక దృక్పథం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ కథలో సన్నీ, పేడయ్య భార్యాభర్తలు. కుటుంబ తగాదాల వలన వారి దాంపత్య జీవితం దూరం అవుతుంది. సన్నీ తల్లి ఎర్రమ్మ. పెడయ్య తల్లి బంగారి… గొడవ ప్రధానంగా వీరి దాంపత్య జీవితం దూరం కావడానికి ప్రధాన కారణం. పంట కోతల సమయంలో కోడలిని ఇంటికి తీసుకొస్తే నాలుగు రూపాయలు సంపాదించవచ్చని బంగారి ఆశ. అలాగే కూతురు తన దగ్గర ఉంటే ఆ నాలుగు రూపాయలు తనే సంపాదించవచ్చునని ఎర్రమ్మ ఆశ. ఇక్కడ వారిద్దరి ప్రధాన సమస్య ఆర్థిక అంశమే. మనిషి జీవితంలో ప్రధాన సమస్య ఆకలి. ఈ ఆకలి వీళ్ళ మధ్య పెద్ద చిచ్చు రేపుతుంది. ఆ ఊరు పెద్ద అసిర్నాయుడు. ఈ తగువుకు తీర్పు ఇస్తాడు. సన్నీ పైడయ్య కలిసి ఉంటే మంచిదని చెబుతాడు. ఎర్రమ్మకు అన్ని విధాల నచ్చజెప్పి వియ్యపురాలు బంగారితో కలిసిమెలిసి ఉంటే అలాగే ప్రయోజనాలను వివరంగా తెలియజేస్తాడు. చివరికి వియ్యపురాళ్లు ఇద్దరూ కలుస్తారు. ఈ బంధం తాత్కాలికమా? శాశ్వతమా? అనే సంశయాలతో కథ ముగుస్తుంది. దళితుల సామాజిక, ఆర్థిక, మానవీయ కోణాలు ఈ కథలో కనిపిస్తాయి.

“చావు” కథలు నారమ్మ అనే దళిత ముసలావిడ చనిపోతుంది. ఆమెను దహనం చేయడానికి అవసరమైన కట్టెల కోసం పడిన కష్టాలే ఈ కథలో ఇతివృత్తం. కులాల మధ్య వ్యత్యాసలు, పేద ధనికుల మధ్య తారతమ్యాలు, పెత్తందారుల అహంకారం, ప్రకృతి వనరులను అప్పనంగా దోచుకోవడం దళిత జనాలను ఇంకా బానిసలుగా తయారుచేయడానికి ప్రయత్నించడం ఈ కథలో చర్చకు వస్తాయి. అభ్యుదయ, విప్లవ, దృక్పథం ఉన్న యువకులు సాధన కోసం ఎంత వారినైనా ఎదురు తిరుగుతారని, ఏకమైపోరాడుతారని దళిత చైతన్యాన్ని కలిగిస్తారని ఈ కథలో చెబుతారు.

ఈ కథ విషయానికి వస్తే అక్కివరం మాలపేటలో సావాలు, ఎరకయ్య దంపతులు ఉంటారు. వీరికి ఆరుగురు సంతానం. పెద్ద కుమారుడు, పోలమ్మ, నారెమ్మ, సింహాద్రి. దాలి, ఆఖరి కొడుకు పేరు పెంటగాడు. కుటుంబంలో దారిద్రం విలయతాండవం చేస్తుంది. ముసలివాళ్ళను_ చిన్నపిల్లలను ఇంటిలో వదిలిపెట్టి ఇంటిల్లిపాది కూలి పనికి వెళుతుంటారు. ఉదయం వెళ్తే సాయంత్రానికి గాని తిరిగిరారు మధ్యలో వెళితే కూలీ పోతుంది.

దళిత ముసలావిడ నారమ్మ చనిపోతుంది. సింహాద్రి వాళ్ళ అమ్మకు, నాన్నకు నాయనమ్మను నారమ్మ చనిపోయిన విషయం చెప్పదు. చెప్పకపోవటానికి కారణాలు ఉన్నాయి. అంతకుముందు ఆమెకు బాగా లేకపోతే చనిపోయిందని భావించి వెళ్లి చెబితే అమ్మానాన్న పని వదిలేసి ఇంటికి వచ్చారు. ఆ పని మధ్యలో ఆపేసి వచ్చారు కాబట్టి యజమాని కూలీ డబ్బులు ఇవ్వడు. చెల్లెలు పోలమ్మ, అక్క సింహాద్రితో పొద్దున్నే అయితే ఏ కబురైన చెప్పు మధ్యాహ్నం అయితే కబురు పంపొద్దు అని చెబుతోంది. ఆ కారణంగా నారమ్మ చనిపోయిన సంగతి సింహాద్రి ఎవరికి చెప్పదు.

నారమ్మ ఎప్పటినుంచో అనారోగ్యంతో బాధపడుతుంటుంది దానికి తోడు విపరీతమైన చలి కప్పుకోవడానికి దుప్పటి కూడా ఉండదు. ఇంటిలోని గుడ్డలన్నీ కప్పుకుంటుంది. అయినా తీవ్రమైన చలిని భరించలేక చనిపోతుంది. సాయంత్రం అందరూ ఇంటికి… చేరుకుంటారు. శవానికి అంత్యక్రియల. కోసం ప్రయత్నాలు ప్రారంభిస్తారు. కాల్చడానికి కట్టెలు లేవని కోడలు సావాలు అంటుంది. కట్టెలు దొరక్కపోతే పాతిపెట్టడమే మంచిదని పక్కింటి లచ్చమ్మ సలహా ఇస్తుంది. కట్టెల కోసం నాయుడుగారి ఇంటి వెళ్తే, ఆయన భార్య చలిలో కుదరదని రేపు పొద్దున రమ్మని తలుపు మూసేసుకుంటుంది. మరో ఇద్దరు, ముగ్గురు దగ్గరికి వెళ్లినా పనిజరగదు. శవాన్ని కాల్చ్బడమే ధర్మం అని లేకపోతే జీవుడు దెయ్యం అవుతాడని అప్పారావు అంటాడు. ప్రతి ఇంటి పశువులను కట్టే కొయ్యలను సేకరిస్తే శవ దహనానికి సరిపోతుందని చెబుతాడు. దాని వరకు శవాన్ని పాతిపెట్టడానికి సిద్ధపడి స్మశానానికి తీసుకెళ్తారు. గొయ్య తీసి రెడీగా ఉంచుతారు. ఈలోపు ఎరకయ్య పెద్ద కొడుకు సీతయ్య మరికొంతమంది యువకులు తెగించి పందిరి అప్పయ్య కళ్ళంలో ఉన్న కట్టెల మోపులను తీసుకు వచ్చి పెద్దల ముందు పడేస్తారు. ఆ కట్టెలతో తన తల్లి నారమ్మ శవాన్ని ఎరకయ్య దహనం చేస్తాడు. అతడి ముఖంలో ఎంతో ప్రశాంతత కనిపిస్తుంది. రేపు పొద్దున ఈ యువకులను దొంగలుగా నిందిస్తే అది తన తప్పేనని తనని శిక్షించమని అడుగుతానని నిర్ధారించుకుంటాడు. సూరయ్య అనే పేట పెద్దమనిషి ద్వారా కథకుడు ఈ కథ వివరిస్తాడు. డబ్బులు గలవాళ్ళు చనిపోతే దీపాలు, దహనానికి గంధపు చెక్కలు, నెయ్యి ల లాంటి ఆడంబరాలు ఉంటాయి. అదే పేదలు చనిపోతే శవం వద్ద చనిపోయిన వాళ్ల గురించి చెప్పుకునే కబుర్లు, కథలే ఉంటాయని పేర్కొంటాడు ఈ పాత్ర ద్వారా రచయిత.

కథకుడు అప్పారావు పాత్ర ద్వారా అభ్యుదయ భావాలు పలికిస్తాడు. ఎన్నాళ్ళని పెద్దవాళ్ళ కాళ్ళ దగ్గర పడి ఉంటారు. అవసరమైతే వారిని ఎదిరించాలన్నాడు. ఆ ప్రభావంతో సూరయ్య ఆలోచనల్లో మార్పు వస్తుంది. దేశంలో దళితులకు బతుకే కాదు, చావు కూడా అత్యంత సమస్య అని చెప్పి కథ ఇది. దళితుల సుదీర్హమైన వాస్తవిక జీవితాలను వారి సమస్యలను ప్రతిభావంతంగా చిత్రించిన కథ చావు. వర్గదృష్టితోనూ సామాజిక దృక్పథంతోనూ దళిత వైతన్యంతోనూ ఆర్థిక విధానంతోనూ లోతుగా పరిశీలిస్తే * యజ్ఞం ” కంటే “ఆర్తి” దానికంటే “చావు” క్రమంగా పరిణితి చెందిన కథలుగా కనిపిస్తాయి.

ప్రసిద్ధ కథారచయిత కాళీపట్నం రామారావుగారి ఆలోచన రూపంగా 1997లో శ్రీకాకుళంలో కథానిలయం పుట్టింది. గురజాడ అప్పారావుగారి దిద్దుబాటు కథ వెలువడిన ఫిబ్రవరి 22వ తేదీన కథానిలయం ప్రారంభమయింది. రామారావుగారి సాహిత్య సంపాదనలో ప్రతి పైసా ఈ కథానిలయానికి అందించారు. అనేక మంది సాహిత్యాభిమానులు, రచయితలూ చేయివేసారు. రామారావుగారి సొంత పుస్తకాలు కథానిలయానికి తొలి పుస్తకాలు అయాయి. మొదటి సభలో పాల్గొన్న గూటాల కృష్ణమూర్తిగారు లండన్‌ నివాసి. చాలాకాలంగా బ్రిటిష్‌ లైబ్రరీతో సంబంధం ఉన్నవారు. ఆయన ఆనాటి సభలో ఉపన్యసిస్తూ – ఇలా ఒక ప్రక్రియకు లైబ్రరీ ఏర్పడటం ప్రపంచం మొత్తంమీద ఇదే ప్రప్రథమం – అన్నారు. రామారావుగారి అవిరామ కృషితో వందలాది మంది సాహిత్య సేకరణకర్తలు కథాసంపుటాలూ, సంకలనాలూ, పత్రికల మూలాలు గాని, ఫొటో నకళ్లు గాని సమకూర్చారు.


5/5 - (2 votes)
Prakasika
Author: Prakasika

Related Articles

Latest Articles